పెనమలూరు చోరీ నిందితులు అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-16T00:40:20+05:30 IST
పెనమలూరు చోరీ నిందితులు అరెస్ట్

విజయవాడ: పెనమలూరు పోలీసు స్టేషను పరిధిలో జరిగిన చోరీ నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ హర్షవర్ధన్ వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.9.72 లక్షలు నగదు, 6.7 గ్రాముల బంగారు ఉంగరం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు గుంటూరుకు చెందిన వేముల శ్రీను, వేముల మహేష్ గా గుర్తించారు. గతంలో శ్రీను కొవ్వూరులో దొంగతనం కేసులో నిందితుడుగా ఉన్నట్లు పేర్కొన్నారు. తన భార్య పనిచేస్తున్న ఇంట్లోనే దొంగతనం చేశాడు. హైదరాబాదు వెళ్ళేందుకు బంగారు రింగు అమ్మాలని ప్రయత్నించి శ్రీను పట్టుబడినట్లు పేర్కొన్నారు.