దుర్గగుడి కేశఖండనశాలలో మహిళలకు ప్రాతినిధ్యం

ABN , First Publish Date - 2021-12-19T17:58:36+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలోని కేశఖండనశాలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి.

దుర్గగుడి కేశఖండనశాలలో మహిళలకు ప్రాతినిధ్యం

విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలోని కేశఖండనశాలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. కేశఖండన శాలలో మహిళలకు అవకాశం కల్పించాలని మంత్రి వెలంపల్లిని దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై దేవాదాయశాఖ కమిషనర్, దుర్గగుడి ఈవో మధ్య  చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దుర్గగుడి కేశఖండన శాలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంది.  తిరుమల, శ్రీశైలం కేశఖండనశాలలో మహిళలు విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రికి మహిళా క్షురకులను నియమించాలని  మహిళా‌ భక్తులు కోరుతున్నారు. 


Updated Date - 2021-12-19T17:58:36+05:30 IST