పవన్ కల్యాణ్ ఓటేసిన చోట టీడీపీ గెలుపు

ABN , First Publish Date - 2021-03-14T17:18:14+05:30 IST

ఏపీ మున్సిపల్ పోల్స్ కౌంటింగ్‌లో ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

పవన్ కల్యాణ్ ఓటేసిన చోట టీడీపీ గెలుపు

విజయవాడ: ఏపీ మున్సిపల్ పోల్స్ కౌంటింగ్‌లో ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పలు చోట్ల ఆసక్తికర ఫలితాలు వెల్లడవుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఓటు వేసిన విజయవాడ కార్పొరేషన్‌లోని 9వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆ పార్టీ అభ్యర్ధి క్రాంతిశ్రీ గెలుపొందారు. విజేత ప్రకటనతో వైసీపీ అభ్యర్ధి శారద కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే... 3, 11, 27, 45 డివిజన్లలో టీడీపీ ముందంజలో ఉంది.  

Updated Date - 2021-03-14T17:18:14+05:30 IST