రాధా రెక్కీ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి: Srikanth

ABN , First Publish Date - 2021-12-31T17:14:55+05:30 IST

టీడీపీ నేత వంగవీటి రాధా రెక్కీ వ్యాఖ్యలపై కాపు సంక్షేమ సేన మీడియా సమావేశం నిర్వహించింది.

రాధా రెక్కీ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి: Srikanth

విజయవాడ: టీడీపీ నేత వంగవీటి రాధా రెక్కీ వ్యాఖ్యలపై కాపు సంక్షేమ సేన మీడియా సమావేశం నిర్వహించింది. కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యదర్శి పెన్నూరి శ్రీకాంత్ మాట్లాడుతూ వంగవీటి రాధా నిస్వార్ధమైన మనిషన్నారు. రాధా హత్యకు కుట్ర చేసారాన్న వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. రెక్కీ, హత్య చేద్దామని అనుకున్న వారు ఆ ఆలోచనలు విరమించుకుంటే మంచిదని హెచ్చరించారు. రాధాకు ప్రజలు అండగా ఉంటారని తెలిపారు. రాధాని అన్ని రాజకీయ పార్టీలు వాడుకున్నాయని వ్యాఖ్యలు చేశారు. పోలీసులు విచారణ జరిపి రెక్కీ చేసిన వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. పోలీసులపై నమ్మకం ఉందని శ్రీకాంత్... రాధాకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అన్నారు. 

Updated Date - 2021-12-31T17:14:55+05:30 IST