AP: మహా పాదయాత్రకు మద్దతుగా టీడీపీ సంఘీభావ ర్యాలీ
ABN , First Publish Date - 2021-12-15T17:13:55+05:30 IST
రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.

అమరావతి: రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ నుంచి సర్కిల్ 3 కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతోంది. జై అమరావతి.. ఒకటే రాజధాని.. అమరావతే రాజధాని అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.