Vijayawada: చెడ్డీ గ్యాంగ్ కేసులో పురోగతి
ABN , First Publish Date - 2021-12-15T14:39:53+05:30 IST
చెడ్డీ గ్యాంగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడ: చెడ్డీ గ్యాంగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‍ని గుజరాత్, మధ్యప్రదేశ్‍లకు పంపగా... ఫుటేజ్‍లోని చెడ్డీ గ్యాంగ్ దుండగులను పోలీసులు గుర్తించారు. గుజరాత్‍లోని దాహోద్‍లోని చెడ్డీ గ్యాంగ్ సభ్యులుగా తెలుస్తోంది. దీంతో దాహోద్ ఎస్పీతో బెజవాడ సీపీ రాణా ఫోన్‌లో మాట్లాడారు. రెండు పోలీసు బృందాలు గుజరాత్‍కు చేరుకుని దుండగులను అరెస్ట్ చేశారు.