కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండి చేయి: విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2021-02-01T19:33:06+05:30 IST

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొండి చేయి చూపారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండి చేయి: విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొండి చేయి చూపారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. బడ్జెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు చెందిన బడ్జెట్‌లా ఉందని ఆరోపించారు. మెట్రోరైలు కోసం ఆరేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నామని అన్నారు. ఏపీకి ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా కేటాయించలేదని.. కానీ రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేని కారిడార్‌ ప్రకటించారని విమర్శించారు. బడ్జెట్‌లో కిసాన్‌ రైళ్ల గురించి ప్రస్తావించలేదని, ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రానికి శ్రద్ధ లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-02-01T19:33:06+05:30 IST