వచ్చే నెల 19న సిరిమానోత్సవం
ABN , First Publish Date - 2021-09-03T12:04:22+05:30 IST
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ పండుగ నిర్వహణ తేదీలను గురువారం ఆలయ అధికారులు, అర్చకులు సంయుక్తంగా ప్రకటించారు. ఈ నెల 23న మండల దీక్ష

విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లమ్మ పండుగ నిర్వహణ తేదీలను గురువారం ఆలయ అధికారులు, అర్చకులు సంయుక్తంగా ప్రకటించారు. ఈ నెల 23న మండల దీక్ష చదురుగుడి వద్ద ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. అదే రోజు ఉదయం 9 గంటలకు వనంగుడి, చదురుగుడి వద్ద పందిరిరాట వేస్తారు. అక్టోబరు 13న అర్ధమండల దీక్ష చేపడ్తారు. 18న సోమవారం తొలేళ్ల ఉత్సవం, 19న సిరిమానోత్సవం జరుగుతాయి. 26న తెప్పోత్సవం, 31న కలశజ్యోతి ఊరేగింపు, నవంబరు 2న ఉయ్యాల కంబాల ఉత్సవం, అదే నెల 3న చండీహోమం, పూర్ణాహుతి ఉంటుంది.