ఏపీ గవర్నర్‌కు లేఖ రాసిన వర్ల రామయ్య

ABN , First Publish Date - 2021-06-22T15:27:52+05:30 IST

వర్ల రామయ్య ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు.

ఏపీ గవర్నర్‌కు లేఖ రాసిన వర్ల రామయ్య

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. సిఐడి అధికారి పీవీ సునీల్ కుమార్, ఆడిషినల్  ఎస్పీ మోకా సత్తిబాబులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోండని దళిత యువతను ప్రోత్సహిస్తున్న సునీల్ కుమార్, అడిషనల్ ఎస్పీలపై  క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశానని.. ఆయన పట్టించుకోలేదని అన్నారు. సివిల్ కాండక్ట్ నిబంధనలను ఉల్లంఘించి ఉగ్రవాదుల చర్యలను సమర్ధించిన ఆ ఇద్దరి అధికారులపై రాజద్రోహం కేసు పెట్టాలని వర్ల రామయ్య గవర్నర్‌ను కోరారు.

Updated Date - 2021-06-22T15:27:52+05:30 IST