చంద్రబాబు మాటల్లో తప్పేముందో డీజీపీ చెప్పాలి: వర్ల

ABN , First Publish Date - 2021-10-14T22:29:16+05:30 IST

డ్రగ్స్ వ్యవహారంపై టీడీపీ నేతలకు డీజీపీ నోటీసులిస్తారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాతో రాష్ట్ర ప్రగతి 20ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న చంద్రబాబు మాటల్లో తప్పేముందో...

చంద్రబాబు మాటల్లో తప్పేముందో డీజీపీ చెప్పాలి: వర్ల

అమరావతి: డ్రగ్స్ వ్యవహారంపై టీడీపీ నేతలకు డీజీపీ నోటీసులిస్తారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాతో రాష్ట్ర ప్రగతి 20ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న చంద్రబాబు మాటల్లో తప్పేముందో  డీజీపీ చెప్పాలన్నారు. చంద్రబాబు చేసింది పొలిటికల్ వ్యాఖ్య, దానిపై సీఎం, మంత్రులు స్పందించాలన్నారు. హెరాయిన్ కింగ్‌పిన్ విజయవాడలో ఆఫీసు పెట్టుకుంటే డీజీపీ అలాంటిదేమీ లేదంటున్నారని, సాక్ష్యాలివ్వండని ప్రతిపక్షాలకు  డీజీపీ నోటీసులివ్వడం హాస్యాస్పదమన్నారు. దర్యాప్తుచేసి సాక్ష్యాలు సేకరించడమనేది పోలీసుల బాధ్యత అన్నారు. ఐవరీకోస్ట్‌కు, ఎమ్మెల్యే ద్వారంపూడికి ఉన్న సంబంధాలేమిటో పోలీసులు ఏనాడైనా విచారించారా?, ఐవరీకోస్ట్ లో ఎమ్మెల్యే ద్వారంపూడి గోడౌన్లు కడుతున్నది నిజమేనా? అని ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-14T22:29:16+05:30 IST