జగన్‌కు నోటీసిచ్చి ఆలయాలు ధ్వంసం చేసిందెవరో చెప్పించాలి: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2021-01-13T16:06:04+05:30 IST

అమరావతి: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు.

జగన్‌కు నోటీసిచ్చి ఆలయాలు ధ్వంసం చేసిందెవరో చెప్పించాలి: వర్ల రామయ్య

అమరావతి: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. అమ్మఒడి సభలో సీఎం జగన్‌ ఆలయాలపై దాడుల గురించి ప్రస్తావించారని... ఆలయాలపై దాడులు చేస్తున్నవారు తనకు తెలుసని అన్నారని లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు. రథాలు తగులబెట్టిన వారే రధయాత్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. డీజీపీ వెంటనే సీఎంకు నోటీసు ఇచ్చి... ఆలయాలు ధ్వంసం చేసిందెవరో చెప్పించాలని కోరారు. లేఖతో పాటు జగన్‌ ప్రసంగ వీడియోను కూడా వర్ల రామయ్య జత చేశారు.

Updated Date - 2021-01-13T16:06:04+05:30 IST