రఘురామకృష్ణ రాజు చిత్తశుద్ధితో ఉన్నారు: వర్ల రామయ్య
ABN , First Publish Date - 2021-07-08T20:45:27+05:30 IST
జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‍లో.. పిటిషనర్ రఘురామకృష్ణరాజు చిత్తశుద్ధితో

అమరావతి: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‍లో.. పిటిషనర్ రఘురామకృష్ణరాజు చిత్తశుద్ధితో ఉన్నారని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ మాట్లాడుతూ.. జగన్ అన్నిశక్తులు ఉపయోగించి బెయిల్ రద్దు కాకుండా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు బృందం, సీబీఐ ఎందుకో తమ విధి నిర్వహణ పట్ల.. ఉదాసీనతతో ఉన్నట్లుగా కనిపిస్తోందని వర్ల రామయ్య అన్నారు.