వైసీపీ అరాచక పాలనపై తల్లీచెల్లీ పోరాడాలి: వర్ల

ABN , First Publish Date - 2021-09-02T22:58:47+05:30 IST

వైసీపీ అరాచక పాలనపై తల్లీచెల్లీ పోరాడాలి: వర్ల

వైసీపీ అరాచక పాలనపై తల్లీచెల్లీ పోరాడాలి: వర్ల

అమరావతి: 2019 ఎన్నికల్లో జగన్‌, విజయలక్ష్మి, షర్మిల ప్రజలను మోసం చేశారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. పార్టీలకతీతంగా జగన్‌ పాలన అందిస్తారని విజయలక్ష్మి చెప్పారని అన్నారు. జగన్‌రెడ్డి పోలీస్ రాజ్యాన్ని నడుపుతున్నారనే విషయం విజయలక్ష్మికి తెలియదా?, ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే విజయలక్ష్మి, షర్మిలకు బాధ్యత లేదా? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ అరాచక పాలనపై తల్లీచెల్లీ కూడా పోరాడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 

Updated Date - 2021-09-02T22:58:47+05:30 IST