వరహాపురంలో సాగునీటి కోసం అన్నదాతల ఆందోళన

ABN , First Publish Date - 2021-08-10T20:49:24+05:30 IST

వరహాపురంలో సాగునీటి కోసం అన్నదాతల ఆందోళన

వరహాపురంలో సాగునీటి కోసం అన్నదాతల ఆందోళన

గుంటూరు: సాగునీటి కోసం రైతన్నలు రోడేక్కారు. వేమూరు మండలంలోని వరహాపురంలో సాగునీటి కోసం అన్నదాతలు మంగళవారం ఆందోళన బాట పట్టారు. పంట కాలవలో కూర్చుని నిరసన తెలిపారు. సాగునీటి సమస్యను త్వరగా పరిష్కరించాలని రైతులు అధికారులతో గోడును వెళ్లబోసుకున్నారు. కొంతమంది రైతులు అధికారుల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. సాగునీరు లేక పొలాలు కౌలుకు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి సాగు చేద్దామంటే సకాలంలో నీరు అందక తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులకు మొర పెట్టుకున్నారు. అయితే అధికారులు రైతులకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. 

Updated Date - 2021-08-10T20:49:24+05:30 IST