విజయవాడలో వంగవీటి రాధా అభిమానుల ఆందోళన
ABN , First Publish Date - 2021-12-29T04:27:52+05:30 IST
వంగవీటి రాధాపై రెక్కీ అంశంపై రాధా, రంగ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగ్ నగర్‌లో రంగా విగ్రహం సాక్షిగా ఆందోళనకు ..+
విజయవాడ: వంగవీటి రాధాపై రెక్కీ అంశంపై రాధా, రంగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగ్ నగర్‌లో రంగా విగ్రహం సాక్షిగా ఆందోళనకు దిగారు. అరవ సత్యం, దేవినేని అవినాష్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రాధాపై కుట్ర చేసిన వారిని అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. అనుమతి లేకుండా ఆందోళన చేశారంటూ ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.