అరవ సత్యం ఆరోగ్య పరిస్థితిపై కుమారుడు ఆందోళన

ABN , First Publish Date - 2021-12-29T04:15:41+05:30 IST

వంగవీటి రాధా ఇంటి వద్ద రెక్కి నిర్వహించారని అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్న దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు ఆరవ సత్యం ఆంధ్రా హాస్పిటల్‌లో ..

అరవ సత్యం ఆరోగ్య పరిస్థితిపై కుమారుడు ఆందోళన

విజయవాడ: వంగవీటి రాధా ఇంటి వద్ద రెక్కి నిర్వహించారని అనుమానిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్న దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు అరవ సత్యం ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే సత్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు చరణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆరోగ్యం బాగోలేదని తన తండ్రి చెప్పినట్లు చరణ్ తెలిపారు. గతంలో తన తండ్రి సత్యంకు సర్జరీ జరిగిందని, ఓ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత హై బ్లడ్ ప్రెజర్ కారణంగా ఆయన నేరుగా ఆసుపత్రికి వెళ్లారని పేర్కొన్నారు. 48 గంటల పాటు సత్యంను పరివేక్షణలో ఉండాలని వైద్యులు సూచించినట్లు చరణ్ తెలిపారు. రెక్కీ నిర్వహించారని తన తండ్రిపై బురద చల్లారని, అది నిజం కాదన్నారు. ఏ కస్టడీకి  తన తండ్రిని ఎవరూ తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు. తమకు ఎవరితో ఎటువంటి గొడవలు లేవని, దీన్ని వివాదం చేయవద్దని అరవ సత్యం తనయుడు చరణ్ కోరారు. 

Updated Date - 2021-12-29T04:15:41+05:30 IST