ఏపీకి ఓకే.. ఒడిశాకు షాక్

ABN , First Publish Date - 2021-06-22T02:44:40+05:30 IST

ఏపీకి ఓకే.. ఒడిశాకు షాక్

ఏపీకి ఓకే.. ఒడిశాకు షాక్

అమరావతి: వంశధార ట్రైబ్యునల్‌లో ఏపీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఏపీ కోరినట్లు 106 ఎకరాల భూమిని సేకరించాల్సిన బాధ్యత ఒడిశా ప్రభుత్వానిదేనని వంశధార ట్రైబ్యునల్‌ స్పష్టం చేసింది. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి భూమి సేకరించి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. వంశధార నదీ జలాలు, నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణపై దాఖలైన 2 మధ్యంతర పిటిషన్లపై వంశధార ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు ఇచ్చింది. నేరడి ప్రాజెక్టు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై ఒడిశా దాఖలు చేసిన ఒక పిటిషన్‌పై ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రతిపాదించినట్లు ప్రాజెక్ట్‌ 106 ఎకరాల్లో సాధ్యం కాదని ఒడిశా పిటిషన్‌ వేసింది. విభేదాల పరిష్కారానికి అప్పీల్‌ అథారిటీ కోసం కేంద్రం ఐఏ దాఖలు చేసింది. కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శికి సమీక్షించే అధికారం ఉందని ట్రైబ్యునల్‌ స్పష్టం చేసింది. ప్రత్యేకంగా అప్పీల్‌ అథారిటీ అవసరం లేదని ట్రైబ్యునల్‌ పేర్కొంది. వంశధార నదీ జలాలను చెరిసగం వాడుకోవాల్సిందేనని ట్రైబ్యునల్‌ తేల్చిచెప్పింది. 

Updated Date - 2021-06-22T02:44:40+05:30 IST