గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 3లక్షల 60 వేల కోవిషీల్డ్

ABN , First Publish Date - 2021-05-09T16:57:26+05:30 IST

పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి బయలుదేరిన 3లక్షల 60 వేల వ్యాక్సిన్లు గన్నవరం చేరుకున్నాయి.

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 3లక్షల 60 వేల కోవిషీల్డ్

కృష్ణాజిల్లా: పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి బయలుదేరిన 3లక్షల 60 వేల వ్యాక్సిన్లు ఆదివారం ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎయిర్ పోర్టుకు చేరుకున్న కొవిషీల్డ్ టీకా డోసులను అధికారులు రోడ్డు మార్గంలో తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాలతో వ్యాక్సిన్లు జిల్లాలకు తరలివెళ్లనున్నాయి.

Updated Date - 2021-05-09T16:57:26+05:30 IST