ఆర్టీసీ, బ్యాంక్, మీడియా ఉద్యోగులకు టీకా
ABN , First Publish Date - 2021-05-05T08:44:31+05:30 IST
ఏపీఎ్‌సఆర్టీసీ, బ్యాంక్ ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీఐఐసీ భవనంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): ఏపీఎ్‌సఆర్టీసీ, బ్యాంక్ ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీఐఐసీ భవనంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మే 15 లోపు కేంద్రప్రభుత్వం మరో 9 లక్షల డోసులను ఏపీకి పంపిస్తుందని చెప్పారు. రెండో డోసు వేయించుకోని వారికోసం వాటిని ఉపయోగిస్తామన్నారు. రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత వ్యాక్సిన్ మిగిలితే 45 ఏళ్లు పైబడి ఇంకా టీకా తీసుకోని వారికి అందిస్తామని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రజలతో మమేకమై పనిచేసే విభాగాలకు వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించామన్నారు. ఆర్టీసీతో పాటు బ్యాంక్ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు.. ఇలాంటి వారందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. మరోవైపు రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు తక్కువగా ఉన్న మండలాల్లో పీహెచ్‌సీల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. ఒక్క పీహెచ్‌సీ ఉన్న ప్రతి మండలంలో మరొక పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 280 మండలాల్లో ఒక్క పీహెచ్‌సీ మాత్రమే ఉందన్నారు. వాటిలో 176 మండలాల్లో కొత్తగా మరొక పీహెచ్‌సీ నిర్మాణాన్ని చేపడతామని చెప్పారు. వీటి నిర్మాణానికి రూ.346 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఒక్కో పీహెచ్‌సీలో 14 మంది సిబ్బందిని నియమించుకోవాలని, దీని కోసం ప్రతి ఏటా ప్రభుత్వంపై రూ.165 కోట్లు భారం పడుతుందని తెలిపారు.
మరో 5 లక్షల కొవిషీల్డ్ డోసులు
గన్నవరం, మే 4: రాష్ర్టానికి మరో 5 లక్షల డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చింది. ఎయిరిండియా విమానంలో పుణె సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ వ్యాక్సిన్ మంగళవారం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరింది. వెంటనే గన్నవరం వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్‌కు తరలించారు.