ఏపీలో వాక్సినేషన్ సెంటర్‌లో కనీస సౌకర్యాల కరువు

ABN , First Publish Date - 2021-05-30T20:23:18+05:30 IST

వ్యాక్సినేషన్ విషయంలో గొప్పలు చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం వాస్తవాలను దాడిపెడుతోంది.

ఏపీలో వాక్సినేషన్ సెంటర్‌లో కనీస సౌకర్యాల కరువు

చిలకలూరిపేట: వ్యాక్సినేషన్ విషయంలో గొప్పలు చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం వాస్తవాలను దాడిపెడుతోంది. వ్యాక్సిన్ వేశాక కనీసం పారాసిటమాల్ మాత్రలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడంలేదు. చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన ఓ వ్యాక్సినేషన్ సెంటర్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కనీసం వ్యాక్సిన్ వేసుకున్నవారికి జ్వరం మాత్రలు కూడా ఇవ్వడంలేదని ఓ వ్యక్తి వాపోయాడు. ఏర్పాట్లు సరిగా లేవని చెప్పాడు. కొన్ని చోట్ల వ్యాక్సిన్లు అమ్ముకుంటున్నారని దీనిపై దర్యాప్తు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేశాడు. చిలకలూరి పేటలో వ్యాక్సినేషన్ ఇచ్చే కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-05-30T20:23:18+05:30 IST