జగన్‌ బీజేపీతో కలిస్తే రాష్ట్రాభివృద్ధి: కేంద్రమంత్రి అథావలె

ABN , First Publish Date - 2021-11-02T07:58:52+05:30 IST

సీఎం జగన్‌ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మరింత సన్నిహితంగా మెలిగితే రాష్ర్టానికి మేలు జరుగుతుందని రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు, కేం

జగన్‌ బీజేపీతో కలిస్తే రాష్ట్రాభివృద్ధి: కేంద్రమంత్రి అథావలె

అమలాపురం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మరింత సన్నిహితంగా మెలిగితే రాష్ర్టానికి మేలు జరుగుతుందని రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి రామదాస్‌ అథావలె అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సోమవారం ఆయన దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగికి నివాళులర్పించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లా డుతూ ఎన్‌డీఏ పాలనలో రాష్ర్టానికి ఎటువంటి అన్యాయమూ జరగలేదన్నారు. రా నున్న అసెంబ్లీ  ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తుందని చెప్పారు.

Updated Date - 2021-11-02T07:58:52+05:30 IST