భారత్, పాకిస్థాన్ విడిపోవడానికి ఆయనే కారణం: ఉండవల్లి
ABN , First Publish Date - 2021-01-12T18:12:57+05:30 IST
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మహమ్మద్ జిన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజమండ్రి: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మహమ్మద్ జిన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్, పాకిస్థాన్ విడిపోవడానికి జిన్నాయే కారణమని అన్నారు. జిన్నా తాత రాజ్‌పుత్ వంశానికి చెందిన వారని, పూర్తి వెజిటేరియన్ అని, మాంసాహారం తినరని అన్నారు. అయితే ఆయన చేపల వ్యాపారం చేసేవారని, దీంతో ఆయనను మత పెద్దలు కుంలం నుంచి బహిష్కరించారన్నారు. ఆయనకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కుల సంఘాన్ని ప్రాధేయపడ్డారని, తాను చేపల వ్యాపారం చేశానే తప్ప.. ఎప్పుడూ తినలేదని, తనను మళ్లీ మతంలోకి చేర్చుకోవాలని కోరినా.. వారు కులంలో చేర్చుకోలేదు. దీంతో జిన్నా తాత ఆ బాధతోనే చనిపోయారని ఉండవల్లి తెలిపారు.
ఈ విషయం జిన్నా తండ్రి మనసులో బాగా నాటుకుపోయిందని, దీంతో ఆయన ఇస్లాంలోకి వెళ్లిపోయారని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. అసలు జిన్నా హిందువేనని, రాముడి వంశమని చెప్పుకుంటారన్నారు. రాముడి వంశమని చెప్పుకునేవారే భారత్, పాకిస్థాన్ విడిపోవడానికి కారకుడయ్యారని.. భిన్నత్వంలో ఏకత్వమంటే ఇదేనేమోనని తాను ఆశ్చర్యపోయానని అరుణ్ కుమార్ అన్నారు.