రాష్ట్రంలో కొత్తరకం రాజకీయం మొదలైంది: ఉండవల్లి
ABN , First Publish Date - 2021-01-12T17:27:59+05:30 IST
గత 15 రోజులుగా రాష్ట్రాలో కొత్తరకం రాజకీయం మొదలైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

రాజమండ్రి: గత 15 రోజులుగా రాష్ట్రంలో కొత్తరకం రాజకీయం మొదలైందని, దానికి మతం రంగు పులిమారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామతీర్థం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని, నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రామతీర్థం ఘటనకు సంబంధించిన కేసు పోలీసులకు అప్పగిస్తే 24 గంటల్లో నిందితులను పట్టుకుంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రామతీర్థం వెళితే.. అదే రోజు అధికారపార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లారని, పోటీగా వెళ్లారా? మరి ఎందుకు వెళ్లారో అర్థం కావడంలేదని అరుణ్ కుమార్ అన్నారు.