ఏపీ మిడ్‌వెస్ట్‌ క్వారీలో ఇద్దరు కార్మికులు బలి

ABN , First Publish Date - 2021-12-19T08:14:35+05:30 IST

ఏపీ మిడ్‌వెస్ట్‌ క్వారీలో ఇద్దరు కార్మికులు బలి

ఏపీ మిడ్‌వెస్ట్‌ క్వారీలో ఇద్దరు కార్మికులు బలి

చీమకుర్తి, డిసెంబర్‌ 18: ప్రకాశం జిల్లా రామతీర్థం సమీపంలోని ఏపీఎండీసీ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ అయిన ఏపీ మిడ్‌వెస్ట్‌ క్వారీలో ముడిరాయిని వెలికి తీసే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. పగుళ్లు గమనించకపోవటంతో దాదాపు 30 అడుగులకుపైగా ఉన్న పెద్ద ముడిరాయి జారి కటింగ్‌ చేస్తున్న వైర్సా ఆపరేటర్లు పి.బిసోయి(19), మున్నా స్వైన్‌(22)పై పడటంతో ఘటనా స్థలంలోనే వారు మృతి చెందారు. శుక్రవారం రాత్రి 8.30 సమయంలో ప్రమాదం జరిగితే శనివారం ఉదయం వరకు సమాచారం బయటకు తెలియకపోవటం విశేషం. డయల్‌ 100 ద్వారా సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఆంజనేయులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు క్వారీలో ఫోర్‌మన్‌గా పనిచేస్తున్న ప్రసన్నకుమార్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.  

Updated Date - 2021-12-19T08:14:35+05:30 IST