Tungabhadra జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2021-11-21T14:37:04+05:30 IST

తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు తుంగభద్ర 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ఇన్‌ఫ్లో 82,440 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో

Tungabhadra జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు తుంగభద్ర 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ఇన్‌ఫ్లో 82,440 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,52,224 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 100.701 టీఎంసీలుగా ఉంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులుగా కాగా ప్రస్తుతం 1,632.96 అడుగులుగా ఉంది.

Updated Date - 2021-11-21T14:37:04+05:30 IST