ఆక్సిజన్ అందక చనిపోతున్నారు: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2021-05-05T09:06:18+05:30 IST
ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతి చెందడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసమర్థతకు నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు

అమరావతి, మే 4(ఆంద్రజ్యోతి): ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృతి చెందడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసమర్థతకు నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. ఆక్సిజన్ అందక రోగులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఇటువంటి దుర్ఘటనలు వైసీపీ ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్టగా పేర్కొన్నారు. ఆక్సిజన్ అందించలేని ప్రభుత్వం మూడు రాజధానులను నిర్మిస్తుందంటే విశ్వసించాలా అని ప్రశ్నించారు.