ఉన్నది పోయె.. రావాల్సిందే రాకపోయే..: తులసి‌రెడ్డి

ABN , First Publish Date - 2021-02-08T19:52:35+05:30 IST

బీజేపీ పాలనలో ఉన్నది పోయె.. రావాల్సిందే రాకపోయే.. అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి‌రెడ్డి ఎద్దేవా చేశారు.

ఉన్నది పోయె.. రావాల్సిందే రాకపోయే..: తులసి‌రెడ్డి

కర్నూలు: బీజేపీ పాలనలో ఉన్నది పోయె.. రావాల్సిందే రాకపోయే.. అన్నట్లు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసి‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోని బీజేపీ నాయకులకు రాష్ట్రం పట్ల అభిమానం ఉంటే వెంటనే పార్టీ, కేంద్ర ప్రభుత్వ పదవులకు రాజీనామా చేయాలని తులసి‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా తీసుకురావడంలో బీజేపీ, వైసీపీ నాయకులు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. గత 50 సంవత్సరాలుగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మాలనుకోవడం దౌర్భాగ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను స్థాపిస్తే బీజేపీ ప్రభుత్వం మూసివేయాలని చూస్తుందోని ధ్వజమెత్తారు. కడప ఉక్కు కర్మాగారం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం కాళహస్తి వద్ద మన్నవరం ఎన్టీపీసీ- బీహెచ్ఈఎల్ ప్రాజెక్టును స్థాపిస్తే బీజేపీ పాలనలో మూతపడిందని తులసి‌రెడ్డి చెప్పారు.

Updated Date - 2021-02-08T19:52:35+05:30 IST