నేడు తిరుమలకు సుప్రీం కోర్టు సీజే

ABN , First Publish Date - 2021-10-14T09:18:33+05:30 IST

నేడు తిరుమలకు సుప్రీం కోర్టు సీజే

నేడు తిరుమలకు సుప్రీం కోర్టు సీజే

తిరుమల, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ గురువారం తిరుమలకు రానున్నారు. ఢిల్లీ నుంచి మధ్యా హ్నం తిరుపతికి చేరుకునే ఆయన తొలుత తిరుచానూరుకు వెళ్లి పద్మావతీ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమలకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణతో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లీ కూడా శ్రీవారి సేవలో పాల్గొంటారు. అదేవిధంగా ఏపీ హైకోర్టు నూతన ప్రఽధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ లలిత తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.  

Updated Date - 2021-10-14T09:18:33+05:30 IST