వేదపాఠశాలలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2021-09-03T12:08:06+05:30 IST

టీటీడీ వేదపాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తు గడువును సెప్టెంబరు 15వ తేదీ వరకు పొడిగించారు. తిరుమల ధర్మగిరిలోని

వేదపాఠశాలలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

తిరుమల: టీటీడీ వేదపాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు  దరఖాస్తు గడువును సెప్టెంబరు 15వ తేదీ వరకు పొడిగించారు. తిరుమల ధర్మగిరిలోని వేదవిజ్ఞానపీఠం, రంగారెడ్డి జిల్లాలోని కీసరగుట్ట, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం,  విజయనగరం, నల్గొండ, కోటప్ప కొండ, గుంటూరు జిల్లాల్లో వేదపాఠశాలలను టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాఠశాలల్లోని వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం అర్హులైన బాలుర నుంచి టీటీడీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మరిన్ని వివరాల కోసం తిరుమల.వోఆర్జీ వెబ్‌సైట్‌ను సంప్రతించవచ్చు.

Updated Date - 2021-09-03T12:08:06+05:30 IST