శ్రీవారికి గోఆధారిత ప్రకృతిసిద్ధ నైవేద్యం

ABN , First Publish Date - 2021-05-02T08:49:09+05:30 IST

గోఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన దేశీ బియ్యం, కూరగాయలు, బెల్లం, పప్పుదినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలను నిత్య నైవేద్యంగా శనివారం తిరుమల వేంకటేశ్వరస్వామికి సమర్పించారు.

శ్రీవారికి గోఆధారిత ప్రకృతిసిద్ధ నైవేద్యం

ప్రయోగాత్మకంగా ప్రసాదాలు సమర్పించిన టీటీడీ


తిరుమల, మే 1 (ఆంధ్రజ్యోతి): గోఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన దేశీ బియ్యం, కూరగాయలు, బెల్లం, పప్పుదినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలను నిత్య నైవేద్యంగా శనివారం తిరుమల వేంకటేశ్వరస్వామికి సమర్పించారు. అనంతరం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నప్రసాదాలను నిత్య నైవేద్యంగా శ్రీవారికి సమర్పించడాన్ని శనివారం నుంచి పునఃప్రారంభించినట్టు తెలిపారు. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూలను కూడా శనివారం బెల్లం, సల్ఫర్‌ ఫ్రీ షుగర్‌(కందసార)తో తయారుచేశారు. 

Updated Date - 2021-05-02T08:49:09+05:30 IST