దేవుళ్ళు.కాం వెబ్‌సైట్‌పై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-10-29T02:09:17+05:30 IST

బ్లాక్‌లో క్యాలెండర్లు, డైరీలను విక్రయిస్తున్న దేవుళ్ళు.కాం వెబ్‌సైట్‌పై

దేవుళ్ళు.కాం వెబ్‌సైట్‌పై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు

తిరుపతి: బ్లాక్‌లో క్యాలెండర్లు, డైరీలను విక్రయిస్తున్న దేవుళ్ళు.కాం వెబ్‌సైట్‌పై తిరుపతి ఈస్ట్ పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. ఎలాంటి అనుమతి లేకుండా బ్లాక్‌లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేసింది. రాజమండ్రికి చెందిన మోహన్ పబ్లికేషన్స్‌పై ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవుళ్ళు.కాం వెబ్‌సైట్‌కు, టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని టీటీడీ ప్రకటించింది. 130 రూపాయల క్యాలెండర్‌కు 200 చెల్లించి భక్తులు మోసపోవద్దని టీటీడీ తెలిపింది. 


Updated Date - 2021-10-29T02:09:17+05:30 IST