టిప్పర్‌ ఢీకొని 50 గొర్రెలు మృతి

ABN , First Publish Date - 2021-02-26T09:04:06+05:30 IST

కృష్ణాజిల్లా, నూజివీడు మండలంలోని మీర్జాపురం వద్ద గురువారం తెల్లవారు జామున టిప్పర్‌ ఢీకొని రూ.5 లక్షల విలువైన 50 గొర్రెలు మృతి చెందాయి. దీంతో బాధితులు లబో దిబోమంటున్నారు...

టిప్పర్‌ ఢీకొని 50 గొర్రెలు మృతి

నూజివీడు రూరల్‌, ఫిబ్రవరి 25: కృష్ణాజిల్లా, నూజివీడు మండలంలోని మీర్జాపురం వద్ద గురువారం తెల్లవారు జామున టిప్పర్‌ ఢీకొని రూ.5 లక్షల విలువైన 50 గొర్రెలు మృతి చెందాయి. దీంతో బాధితులు లబో దిబోమంటున్నారు. టిప్పర్‌ తమ గొర్రెలపైకి వస్తుందని గమనించి ఆపేందుకు ప్రయత్నించగా, తమ మీదకు కూడా ఎక్కించేందుకు డ్రైవర్‌ ప్రయత్నించాడని బాధితులు.. సుంకొల్లు గ్రామానికి చెందిన మాగంటి నారాయణ, మాగంటి శ్రీనివాసరావు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి అధికారులు ఎవరూ రాకపోవడంతో  స్థానికులతో కలిసి ప్రధాన రహదారిపై బైటాయించారు. నూజివీడు రూరల్‌ ఎస్సై రంజిత్‌కుమార్‌, మీర్జాపురం పశు సంవర్ధకశాఖ వైద్యాధికారిణి అక్కడికి వచ్చారు. వైఎస్సార్‌ బీమాలో పశు నష్ట పరిహారం పఽథకంలో ఒక్కొక్క గొర్రెకు రూ.6 వేల నష్టపరిహారం ప్రభుత్వం నుంచి వస్తుందని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

Updated Date - 2021-02-26T09:04:06+05:30 IST