వేర్వేరు చోట్ల Trains ఢీకొని ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-10-20T12:57:59+05:30 IST

నెల్లూరు-కావలి మధ్యలో వేర్వేరు చోట్ల రైళ్లు ఢీకొని ఇద్దరు మృతి చెందినట్లు మంగళవారం రైల్వే పోలీసులు గుర్తించారు. కావలి జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ శ్యాంకుమార్‌ కథనం మేరకు.. బిట్రగుంట రైల్వే

వేర్వేరు చోట్ల Trains ఢీకొని ఇద్దరి మృతి

నెల్లూరు: నెల్లూరు-కావలి మధ్యలో వేర్వేరు చోట్ల రైళ్లు ఢీకొని ఇద్దరు మృతి చెందినట్లు మంగళవారం రైల్వే పోలీసులు గుర్తించారు. కావలి జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ శ్యాంకుమార్‌ కథనం మేరకు.. బిట్రగుంట రైల్వే సెక్షన్‌ పరిధిలోని కొడవలూరు, పడుగుపాడు స్టేషన్ల మధ్య 180/2-4 కిలో మీటరు వద్ద విజయవాడ వైపు వెళ్లే శ్రద్ధ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని (25) ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడు బ్లూ జీన్స్‌ఫ్యాంట్‌, వైలెట్‌ కలర్‌ షర్టు ధరించి ఉన్నాడు. అలాగే శ్రీవేంకటేశ్వరపాలెం, బిట్రగుంట స్టేషన్ల మధ్య 212/15-14 కిలోమీటరు వద్ద నెల్లూరు వైపు వెళ్లే గుర్తు తెలియని రైలు ఢీకొని (40) ఏళ్ల  వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద లభించిన సెల్‌ఫోన్‌ ఆధారంగా కొండబిట్రగుంట గ్రామానికి చెందిన రాచూరి విజయ్‌కుమార్‌గా గుర్తించారు. ఈ ఇద్దరి మృతదేహాలను కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-20T12:57:59+05:30 IST