చేపల చెరువులో బోల్తాపడ్డ ట్రాక్టర్‌

ABN , First Publish Date - 2021-05-05T09:14:15+05:30 IST

నెల్లూరు జిల్లా రూరల్‌ మండలం గొల్లకందుకూరు గ్రామంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. నలుగురు కూలీలు సహా సర్పంచ్‌ మృత్యువాతపడ్డారు

చేపల చెరువులో బోల్తాపడ్డ ట్రాక్టర్‌

సర్పంచ్‌ సహా నలుగురు మహిళా కూలీలు మృతి


నెల్లూరురూరల్‌, మే 4: నెల్లూరు జిల్లా రూరల్‌ మండలం గొల్లకందుకూరు గ్రామంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. నలుగురు కూలీలు సహా సర్పంచ్‌ మృత్యువాతపడ్డారు. సజ్జాపురం నుంచి గొల్లకందుకూరులోని పుచ్చకాయల తోటలో కాయలు కోసేందుకు కూలీలతో ట్రాక్టర్‌ బయలుదేరింది. చేపల చెరువు పక్కనే ఉన్న గట్టు మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో అప్పటికే నీటి ప్రవాహంతో నాని ఉన్న చెరువు గట్టు కుంగిపోవడంతో ట్రాక్టర్‌ ఒక్కసారిగా ఒరిగిపోయింది. డ్రైవర్‌ అదుపుచేసేలోగానే చెరువులోకి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కూలీలు, సజ్జాపురం గ్రామ సర్పంచ్‌ అప్పుకూటి పెంచలయ్య(66) అక్కడిక్కడే మరణించారు. 

Updated Date - 2021-05-05T09:14:15+05:30 IST