Tirupati: మట్కా బీటర్ అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-26T12:57:55+05:30 IST
మట్కా జూదాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.

తిరుపతి: మట్కా జూదాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సంజయ్‌గాంధీ కాలనీకి చెందిన డి.మహేష్ మట్కా నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో అతడిపై నిఘాపెట్టారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం గురవారెడ్డి సమాధులవద్ద మట్కా బీటర్ మహే్‌షను ఎస్‌ఐ నాగేంద్రబాబు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా.. మట్కా స్లిప్పులతోపాటు, జూదానికి సంబంధించిన రూ.5090 గుర్తించడంతో స్వాధీనం చేసుకున్నారు.