Tirumalaలో 4న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ABN , First Publish Date - 2021-10-29T11:51:39+05:30 IST
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నవంబరు4వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఆ రోజు ఆలయంలో దీపావళి

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నవంబరు4వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఆ రోజు ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పూజలకు ఇబ్బంది లేకుండా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే వీఐపీ బ్రేక్ కోసం 3వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ స్పష్టం చేసింది.