రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల వాయిదా

ABN , First Publish Date - 2021-08-20T11:57:54+05:30 IST

సెప్టెంబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు టీటీడీ గురువారం ప్రకటించింది.

రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల వాయిదా

తిరుమల: సెప్టెంబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు టీటీడీ గురువారం ప్రకటించింది. ప్రతినెలా 20వ తేదీన మరుసటి నెలకు సంబంధించి రూ.300 దర్శన టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పరిపాలనాపరమైన కారణాల వల్ల ఆ కోటాను వాయిదా వేశామని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని టీటీడీ తెలిపింది.

Updated Date - 2021-08-20T11:57:54+05:30 IST