రహదారిపై మూడు కొండచిలువలు
ABN , First Publish Date - 2021-12-27T02:30:14+05:30 IST
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో రహదారిపైకి ఒక్కసారిగా మూడు కొండచిలువలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో రహదారిపైకి ఒక్కసారిగా మూడు కొండచిలువలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పెనుమాకలోని మండల పరిషత్ పాఠశాల వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న సుమారు 10 అడుగుల పొడవున్న మూడు కొండచిలువలను స్థానికులు గమనించారు. యువకులు పోగై, మూడు కొండచిలువలను కొట్టి చంపేశారు. ఒకదాని వెంట ఒకటిగా మూడు కొండచిలువలు రావడం స్థానికంగా కలకలం సృష్టించింది.