భూసేకరణకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-01-13T22:34:09+05:30 IST

పట్టణాలు, నగరాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాల విక్రయానికి అవసరమైన భూ సేకరణకు ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది.

భూసేకరణకు ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు

అమరావతి: పట్టణాలు, నగరాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాల విక్రయానికి అవసరమైన భూ సేకరణకు ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఏపీ టీడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా డీటీసీపీ డైరెక్టర్ వి.రాముడు, ఏపీ హౌసింగ్ బోర్డు వీసీ బి.రాజగోపాల్, ఏఎంఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ టి.చిరంజీవిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 21 లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వ ఆదేశించింది. కమిటీ సూచనల ఆధారంగా ఏ పట్టణ పరిధిలో ఎన్ని ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పట్టణ, నగర ప్రాంతాలతో పాటు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిలో ఉన్న భూములను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది.

Updated Date - 2021-01-13T22:34:09+05:30 IST