మూడు రోజులు భారీ వర్షాలు
ABN , First Publish Date - 2021-10-29T09:00:33+05:30 IST
మూడు రోజులు భారీ వర్షాలు
శ్రీలంక తీరం సమీపాన అల్ప1పీడనం
అమరావతి, విశాఖపట్నం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రస్తుతం శ్రీలంక తీరానికి దగ్గరగా కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా వాయువ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడ్డాయి.