గోదావరి పులస.. అ‘ధర’హో!
ABN , First Publish Date - 2021-09-03T09:50:44+05:30 IST
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గౌతమి తీరంలో లభించిన పులసల ధర అధరహో అనిపించింది. సుమారు రెండు కిలోలకు పైగా బరువున్న రెండు పులసలు ఒక్కొక్కటీ రూ.20వేలకు పైగా ధర పలికింది.

- ఒకటి రూ.23వేలు, మరొకటి రూ.25వేలు
- యానాం చరిత్రలో ఇదే అత్యధికం
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గౌతమి తీరంలో లభించిన పులసల ధర అధరహో అనిపించింది. సుమారు రెండు కిలోలకు పైగా బరువున్న రెండు పులసలు ఒక్కొక్కటీ రూ.20వేలకు పైగా ధర పలికింది. ఇంత ధర పలకడం యానాం చరిత్రలోనే ఇదే తొలిసారిగా చెప్పవచ్చు. గురువారం మార్కెట్‌కు తెచ్చిన ఓ పులసను నాగలక్ష్మి అనే మహిళ రూ.23 వేలకు, మరో పులసను రూ.25 వేలకు భాగ్యలక్ష్మి అనే మహిళ వేలంలో దక్కించుకున్నారు. అనంతరం.. వారు మరికొంత లాభంతో అక్కడికక్కడే అమ్మడం విశేషం.