నేటి నుంచి దసరా మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-10-07T09:21:56+05:30 IST

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

నేటి నుంచి దసరా మహోత్సవాలు

  • స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దుర్గమ్మ 
  • శైలపుత్రి అలంకారంలో భ్రామరి దర్శనం
  • శ్రీవారి బ్రహ్మోత్సవాలకు
  • అంకురార్పణ, నేడు పెద్ద శేషవాహన సేవ
  • నేటి సాయంత్రం ధ్వజారోహణం 

తిరుమల, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం 5.10నుంచి 5.30 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం చేస్తారు. అనంతరం వాహన సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 8.30 గంటలకు ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో పెద్దశేష వాహనసేవ జరుగనుంది. 15న ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపం, వాహనసేవలు నిర్వహించే కల్యాణోత్సవ మండపాన్ని విద్యుత్‌, పుష్పాలంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయంతో పాటు బయట ప్రదేశాల్లో అలంకరణలకు 9 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50వేల కట్‌ప్లవర్స్‌ను వినియోగిస్తున్నారు.

Updated Date - 2021-10-07T09:21:56+05:30 IST