రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల

ABN , First Publish Date - 2021-03-21T11:55:11+05:30 IST

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి ఏప్రిల్‌ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ శనివారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది...

రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి ఏప్రిల్‌ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ శనివారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. వివిధ స్లాట్లలో రోజుకు 25 వేల చొప్పున టికెట్లను విడుదల చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు విడుదల చేయగా సాయంత్రం 6 గంటల సమయానికి మొదటి నాలుగు రోజుల కోటా పూర్తయింది. తెప్పోత్సవాల సందర్భంగా 24, 25, 26 తేదీల్లో కోటా విడుదల చేయలేదు.

Updated Date - 2021-03-21T11:55:11+05:30 IST