థర్మల్‌ నిలిపేసి రాష్ట్రాన్ని ముంచేశారు: టీడీపీ

ABN , First Publish Date - 2021-10-15T06:50:15+05:30 IST

‘వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కో ఆధీనంలో ఉన్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో

థర్మల్‌ నిలిపేసి రాష్ట్రాన్ని ముంచేశారు: టీడీపీ

అమరావతి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ జెన్‌కో ఆధీనంలో ఉన్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని కావాలని నిలిపివేసింది. బొగ్గును కొనడం కూడా నిలిపివేసి రాష్ట్రాన్ని ముంచేసింది. దాని ఫలితంగానే ఇప్పుడు ఒక యూనిట్‌ విద్యుత్‌ రూ.20 పెట్టి కొనాల్సి వస్తోంది’’ అని టీడీపీ ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘మన రాష్ట్రానికి 27వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే 18 వేల మెగావాట్లు మాత్రమే చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి 31 శాతం ఉత్పత్తిని నిలిపివేశారు. తెలంగాణకు 14 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే 13,500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. రెండు రూపాయలకు లభించే విద్యుత్‌ను వదిలిపెట్టి రూ.20 పెట్టి కొంటున్నారు. కమీషన్ల కోసమే ఈ వ్యవహారం నడిపిస్తున్నారు.’’ అని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చౌకగా ఒక యూనిట్‌ విద్యుత్‌ రూ.10కి అమ్ముతుంటే ఏపీ ప్రభుత్వం రూ.20 పెట్టి ఎందుకు కొంటోందో వారికే తెలియాలని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-15T06:50:15+05:30 IST