జగన్, షర్మిల మధ్య మనస్పర్ధలు లేవు
ABN , First Publish Date - 2021-07-11T09:15:23+05:30 IST
‘‘సీఎం జగన్, షర్మిల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. అన్న, చెల్లి మధ్య గొడవ పెట్టేలా మీరు మాట్లాడితే మేమేం చేయాలి. వారి మధ్య విభేదాలు ఉన్నట్టు మనమే సృష్టించుకుంటున్నాం’’ అని రాష్ట్ర డిప్యూటీ సీఎం
‘ఇద్దరు సీఎం’ల మధ్య పరస్పర అభిమానం ఉంది
డిప్యూటీ సీఎం నారాయణస్వామి
తిరుమల, జూలై 10(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్, షర్మిల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. అన్న, చెల్లి మధ్య గొడవ పెట్టేలా మీరు మాట్లాడితే మేమేం చేయాలి. వారి మధ్య విభేదాలు ఉన్నట్టు మనమే సృష్టించుకుంటున్నాం’’ అని రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. శనివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. జగన్‌కు ఏపీ, తెలంగాణ వేరు కాదన్నారు. కేసీఆర్ అంటే జగన్‌కు మంచి అభిమానం ఉందన్నారు. అలాగే జగన్ అంటే కేసీఆర్‌కు కూడా మంచి అభిమానం అన్నారు. జలవివాదంపై ఇప్పటి వరకు చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన వల్లే రాష్ట్రం నాశనమైందన్నారు. తెలంగాణ, ఏపీ అంటే ఇండియా, పాకిస్తాన్ కాదని నారాయణస్వామి అన్నారు.