ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి

ABN , First Publish Date - 2021-10-21T08:21:39+05:30 IST

‘‘ముఖ్యమంత్రిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోవాలా? అందుకే వైసీపీ శ్రేణులు ఆవేశపడ్డాయి.

ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి

టీడీపీ యాక్షన్‌కు రియాక్షన్‌ ఉంటుంది

ఎంపీ మోపిదేవి వ్యాఖ్య

గుంటూరు, అక్టోబరు 20: ‘‘ముఖ్యమంత్రిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోవాలా? అందుకే వైసీపీ శ్రేణులు ఆవేశపడ్డాయి. అందులో తప్పేముంది?’’ అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రశ్నించారు. గుంటూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన... దాడులను సమర్థించారు. ‘‘టీడీపీ యాక్షన్‌కు రీయాక్షన్‌ ఉంటుంది. సీఎంపై వ్యాఖ్యలు చేసే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. టీడీపీ నేతలు, కొందరు పెయిడ్‌ ఆర్టిస్టులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. పట్టాభి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి’’ అని విమర్శించారు. 

Updated Date - 2021-10-21T08:21:39+05:30 IST