ఉద్యోగుల ఆత్మగౌరవ ఉద్యమం సఫలీకృతం

ABN , First Publish Date - 2021-05-21T07:11:06+05:30 IST

వైద్య ఆరోగ్య శాఖ కమిషర్‌ కాటమనేని భాస్కర్‌ వేధింపులకు నిరసనగా ఉద్యోగులు, ఏపీజీఈఏ మద్దతుతో గత మూడు రోజులుగా కొనసాగించిన ఉద్యమం సఫలీకృతం అయిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల

ఉద్యోగుల ఆత్మగౌరవ ఉద్యమం సఫలీకృతం

నిరసన విరమిస్తున్నట్టు ప్రకటించిన జేఏసీ

అసెంబ్లీ వద్ద సజ్జల, మంత్రి ఆళ్ల నానితో చర్చలు


విజయవాడ(పాయకాపురం), మే 20: వైద్య ఆరోగ్య శాఖ కమిషర్‌ కాటమనేని భాస్కర్‌ వేధింపులకు నిరసనగా ఉద్యోగులు, ఏపీజీఈఏ మద్దతుతో గత మూడు రోజులుగా కొనసాగించిన ఉద్యమం సఫలీకృతం అయిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ, వైద్య ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్‌ జి ఆస్కారరావు ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో రాష్ట్ర సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ  మంత్రి ఆళ్ల నానిని కలిశామని వారు తెలిపారు. కాటమనేని భాస్కర్‌ వ్యవహార శైలి, వివిధ సమావేశాల్లో ఉద్యోగులపై చేసిన వాఖ్యలను వివరించామన్నారు. వివిధ సమస్యలపై చర్చించామని, 20 డిమాండ్లపై లిఖితపూర్వక విజ్ఞాపన ఇచ్చామని చెప్పారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి ఒక వారం రోజుల్లో వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ముద్డాడ రవిచంద్ర, కమిషనర్‌, ఇతర ఉన్నత అధికారులు, ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి, తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. వైద్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌నూ ప్రతినిధి బృందం కలసి చర్చించిందన్నారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారని, పని ఒత్తిడిలో మాట్లాడటమే తప్ప ఉద్యోగులపై ఎటువంటి దురుద్దేశం లేదని, అందరం కలసి కరోనా సమయంలో పని చేసి ప్రజల మన్ననలు పొందాలని కోరారని ఆస్కారరావు తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారని వారు తెలిపారు. 

Updated Date - 2021-05-21T07:11:06+05:30 IST