ఏసుక్రీస్తు విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2021-05-21T09:50:10+05:30 IST

గుంటూరు జిల్లా తాడేపల్లిలో డోలా్‌సనగర్‌ గుడ్‌ షెపర్డ్‌ కాన్వెంట్‌ సమీపంలోని ఏసుక్రీస్తు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు

ఏసుక్రీస్తు విగ్రహం ధ్వంసం

తాడేపల్లి టౌన్‌, మే20: గుంటూరు జిల్లా తాడేపల్లిలో డోలా్‌సనగర్‌ గుడ్‌ షెపర్డ్‌ కాన్వెంట్‌ సమీపంలోని  ఏసుక్రీస్తు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ మేరకు గురువారం పోలీసులకు గుడ్‌షెపర్డ్‌ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. విగ్రహం చుట్టూ ఉన్న అద్దాలను సైతం పగులగొట్టి విగ్రహాన్ని కూల్చి ధ్వంసం చేసినట్టు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఏసుక్రీస్తు విగ్రహ ధ్వంసమైన ఘటనపై ఏపీ క్రిస్టియన్‌ జేఏసీ చైర్మన్‌ యలమంచిలి ప్రవీణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-21T09:50:10+05:30 IST