మాతో రెవెన్యూ ఉద్యోగుల సంఘం కలవాలి

ABN , First Publish Date - 2021-12-31T08:06:05+05:30 IST

మాతో రెవెన్యూ ఉద్యోగుల సంఘం కలవాలి

మాతో రెవెన్యూ ఉద్యోగుల సంఘం కలవాలి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిలుపు

విజయవాడ(వన్‌టౌన్‌), డిసెంబరు 30: తమ సంఘంతో రెవెన్యూ ఉద్యోగుల సంఘం కలవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆర్‌.సూర్యనారాయణ కోరారు. విజయవాడలో నూతనంగా ప్రారంభించిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో గురువారం రాష్ట్రకార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అందరం భాగస్వాములు కావాల్సి ఉందన్నారు. సంఘ బలోపేతం కోసం వీఆర్వోల సంఘం కూడా కలవాల్సిన అవసరముందన్నారు. రవీంద్రరాజును ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి కార్యదర్శిగా నియమించామని తెలిపారు. కాగా, అటు రెవెన్యూ, ఇటు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల తరఫున ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని రవీంద్రరాజు బదులిచ్చారు.  

Updated Date - 2021-12-31T08:06:05+05:30 IST