పోలీసులు వైసీపీకి తొత్తుల్లా పనిచేస్తున్నారు
ABN , First Publish Date - 2021-11-26T09:50:47+05:30 IST
పోలీసులు వైసీపీకి తొత్తుల్లా పనిచేస్తున్నారు

టీడీపీ ముస్లిం మైనారిటీ నేత మౌలానా ముస్తాక్ అహ్మద్
నరసరావుపేట టౌన్, నవంబరు 25: పోలీసులు కొందరు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆరోపించారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువుకు చెందిన షేక్ సైదాను గురువారం ఆయన నరసరావుపేట ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా మౌలానా మాట్లాడారు. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అంబేడ్కర్ రాజ్యాంగం ఉందా? లేదా వైసీపీ రౌడీరాజ్యం ఉందా? అని ప్రశ్నించారు. సైదా మీద దాడి చేసిన శివారెడ్డి, అతని అనుచరులపై తక్షణమే కేసు పెట్టకుంటే మైనారిటీలు, టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.